రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రక్రియ ఆగదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రక్రియ ఆగదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రంలోని పెద్దలు నిర్ణయించారని, అందువల్ల ఈ మధ్య కాలంలో సీమాంధ్రులు తగిన నిర్ణయం తీసుకుని, ఎక్కడో ఒకచోట కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలని ఆమె సూచించారు.
అలాగే, హైదరాబాద్ నగరంలో ఎవరుండాలి, ఎవరు వద్దు అనే మీమాంస అనవసరమని, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో నివసించే హక్కు అందరికి ఉందని ఆమె వెల్లడించారు.