హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రజల మనోభావాలతో ఆటలాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ మండిపడ్డారు. ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణకు తమ మద్దతని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రజలతో ఆటలాడుతూ పబ్బం గడుపుతుందన్నారు. తాము ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణకే సుముఖంగా ఉన్నామన్నారు. సింగరేణి బొగ్గు కర్మాగారం ఎప్పటికీ తెలంగాణకే చెందుతుందన్నారు. ఒకవేళ అలా కాకుండా బొగ్గు ముట్టుకుంటే కాంగ్రెస్ మసి అవడం ఖాయమన్నారు. ఇదిలా ఉండగా తెలుగువారికి కాంగ్రెస్ సస్పెన్స్ సినిమా చూపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి చోద్యం చూస్తోందన్నారు.