ఒంగోలు టౌన్ : జిల్లా ప్రజలకు రక్త నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ చైర్మన్ విజయకుమార్ చెప్పారు. కొన్ని రోజుల కిందట వరకు రక్త నిల్వలు తగ్గిపోయిన నేపథ్యంలో విద్యా సంస్థలు, ఉద్యోగులు, వివిధ రకాల క్లబ్‌లు ముందుకు వచ్చి రక్తదానం చేశాయన్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో రక్త నిల్వల కొరత ఉన్నట్లు తెలియడంతో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి 183 యూనిట్లు రక్తం అందించినట్లు తెలిపారు. కనుమళ్లలోని ఎంఎల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 63 యూనిట్లు, ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ విద్యార్థులు 26 యూనిట్లు, అందుబాటులో రక్త నిల్వలు
ఒంగోలు వాసవీ క్లబ్ ప్రతినిధులు 21 యూనిట్లు, స్థానికంగా 12 యూనిట్లు రక్తం అందించినట్లు వివరించారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్త నిల్వల వివరాలను గ్రూపుల వారీగా కలెక్టర్ వెల్లడించారు. ఓ-పాజిటివ్ 96యూనిట్లు, ఏ-పాజిటివ్ 55 బీ-పాజిటివ్ 71, ఏబీ-పాజిటివ్ 11, ఓ-నెగెటివ్ 9, ఏ-నెగెటివ్ 4, బీ-నెగెటివ్ 3 యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రక్తం అవసరమైన వారు తాము రక్తదానం చేయడంతోపాటు ఒక యూనిట్‌కు 700 రూపాయలు చెల్లించాలని చెప్పారు. రక్తదానం చేయకుండా పొందాలనుకునే వారు 1050 రూపాయలు చెల్లించాలన్నారు. సమావేశంలో జిల్లాపరిషత్ సీఈఓ, రెడ్‌క్రాస్ సొసైటీ ఇన్‌చార్జి సెక్రటరీ ప్రసాద్, సీపీఓ పీబీకే మూర్తి పాల్గొన్నారు.
అందుబాటులో రక్త నిల్వలు
Published Fri, Aug 15 2014 3:46 AM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement
Advertisement