ఏలూరు (సెంట్రల్): ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని టూటౌన్ స్టేషన్ పరిధిలో ఒక కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలుడు దుస్తుల షాపులో పనిచేస్తున్నాడు. బాలుడి ఇంటిపక్క పోర్షన్‌లో నివాసం ఉంటున్న ఎనిమిదేళ్ల బాలిక మూడో తరగతి చదువుతోంది.
బాలికకు జ్వరంగా ఉండటంతో మూడురోజులుగా స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఆ బాలుడు చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావం కావడాన్ని గమనించిన ఆమె తల్లి ఏమైందని అడగడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాలుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ బంగారురాజు ఘటనపై విచారణ చేపట్టారు.
చిన్నారిపై లైంగిక దాడి
Published Thu, Mar 3 2016 10:53 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
Advertisement
Advertisement