అభం శుభం తెలియని పసిపాపను చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు.
అభం శుభం తెలియని పసిపాపను చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇందిరానగర్‌లో బుధవారం జరిగింది. స్థానికంగా ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని పొరుగునే ఉండే ఆచన్న(46) అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రక్తపు మరకలతో ఇంటికి వచ్చిన చిన్నారిని చూసిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చే స్తున్నారు.