మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన బంధువుల ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం అండదండలతోనే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం నడుస్తోందన్నారు. సీఎం కిరణ్ సమైక్య ఉద్యమ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటుకు అనుమతిఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీని ఆదేశించడం ఆయన దురంహరానికి నిదర్శనమన్నారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరిగిపోతుందని సీఎం తనతో ప్రకటన చేయించారని డీజీపీ చెప్పడం చూస్తుంటే తెలంగాణ పట్ల సీఎంకు ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోందన్నారు. కిరణ్ కుమార్‌రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. అయనను వెంటనే బర్తరఫ్ చేసి, రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా హింసకు తావులేకుండా శాంతియుతంగా జరిగిందన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలా వ్యవహరిస్తూ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నాడన్నారు. చందబ్రాబు, అశోక్‌బాబు, కిరణ్‌బాబు అంతా ఆంధ్ర బాబులేనన్నారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ లావణ్యశ్రీనివాస్‌రెడ్డి,టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, పట్టణాధ్యక్షుడు సలాం, నాయకులు శ్రీధర్‌యాదవ్, బల్యాల కిషన్, జీవన్, మోచి కిషన్, శ్రీకాంత్ ఉన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి
Published Wed, Oct 9 2013 3:58 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement