విభజనపై కేంద్ర విధానం సరైంది కాదు!
రాష్ట్ర విభజనపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తాను దీక్ష చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. విభజనపై కేంద్రం అనుసరించిన విధానం సరైనది కాదు అని అన్నారు.
ప్రజల ఇష్టానుసారం కాక స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. స్వాతంత్ర్య విలువలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. రాష్ట్ర విభజనపై కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది చంద్రబాబు అన్నారు.
ప్రజాస్వామ్యంలో సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని.. అందర్ని కలుపుకోని పోవాలని ఆయన అన్నారు. 70 రోజులగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తెలుగు జాతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆంధ్ర భవన్ లో సోమవారం మధ్నాహ్నం మూడు గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు.