రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడూ చెప్పలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు.
రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడూ చెప్పలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. రైతులు తీసుకున్న అన్ని రకాల బ్యాంకు రుణాలను మాఫీ చేసేస్తానని ఆయన ఎప్పుడూ అనలేదన్నారు.
ఒకవేళ ఎన్నికలకు ముందు తమలాంటి నేతలు అలా మాట్లాడి ఉంటే.. దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడు అవుతారని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన మాటలకు తమ పార్టీ అధినేత బాధ్యుడ కానే కారని ఆమె పరోక్షంగా అన్నారు.