రెండు మొనల బాణం వదిలిన బాబు | Chandrababu naidu again shows double standards on bifurcation | Sakshi
Sakshi News home page

రెండు మొనల బాణం వదిలిన బాబు

Published Sun, Feb 16 2014 5:07 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

రెండు మొనల బాణం వదిలిన బాబు - Sakshi

రెండు మొనల బాణం వదిలిన బాబు

తాడేపల్లిగూడెం: రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్లు, రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నింట్లోనూ ఈ సిద్ధాంతంతోనే ముందుకెళ్తున్నారు. ఆఖరికి తాను సంధించే బాణంలోనూ రెండు కళ్ల సిద్ధాంతం తప్పకుండా చూసుకున్నారు చంద్రబాబు. విభజనపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న చంద్రబాబు తాను సంధించిన బాణానికి రెండు మొనలు ఉండేలా చూసుకుని ప్రత్యేకత చాటుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం జరిగిన టీడీపీ ప్రజాగర్జన సభలో కార్యకర్తలు చంద్రబాబుకు ఒక విల్లంబు, బాణాన్ని బహూకరించారు. రెండు మొనలు ఉన్న ఈ బాణాన్ని అందుకున్న చంద్రబాబు.. సంబరంగా సంధించారు. రెండు కళ్ల బాబుకు.. రెండు మొనల బాణమే కరెక్టని ప్రజలు నవ్వుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement