హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలును విడుదల చేసిన విషం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు... పార్టీ నాయకులకు సూచనలు ఇచ్చారు.
పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
Published Wed, Jun 3 2015 9:55 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement