రాష్ట్రానికి చీకటి రోజు ఇది: చంద్రబాబు
నేడు చరిత్రలో రాష్ట్రానికి చీకటి రోజు.. జీవితంలో మరిచిపోలేని రోజు ఇది.
విజయవాడ: నేడు చరిత్రలో రాష్ట్రానికి చీకటి రోజు.. జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఈ రోజు మీ అందర్నీ కష్ట పెడుతున్నాను.. మండుటెండను లెక్క చేయకుండా మీరు ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర విభజనను గుర్తు చేసుకొని రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ' మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలను. అన్నీ రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి, అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. మనం నవ నిర్మాణ దీక్ష జరుపుకుందాం.
రాష్ట్ర అవతరణ సందర్భంగా మనకు జరిగిన నష్టాన్ని నెమరు వేసుకుందాం. మనం చాలా అవమానాలు పడ్డాం.. ఇంటిలో కూర్చొని బాధపడితే లాభం లేదు.. కొన్ని దేశాలు మనకు ఆదర్శం కావాలి.. రెండో ప్రపంచంలో జపాన్ బూడిదయిపోయింది.. అయినా ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్లి కష్టపడి దేశ నిర్మాణానికి పాటుపడ్డారు.. అంచలంచలుగా అభివృద్ది సాధించారు.. ఇంకా చాలా దేశాలు ఇలాంటి సమస్యల ఎదుర్కొన్నాయి.. వాళ్ల కష్టంతో తెలివితేటలతో ఎలా పైకొచ్చారా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అన్నారు.