పామూరు/వేటపాలెం (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మండలంలోని దూబగుంట్ల గ్రామంవద్ద ట్రిపుల్‌ఐటీ కళాశాలకు భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్, ఎమ్మెల్యే కదిరి బాబూరావులు పరిశీలించారు. ఈసందర్భంగా హెలీప్యాడ్, భూమిపూజ ప్రాంతం, పైలాన్ నిర్మాణపనులు, బహిరంగసభ వేదికలను పరిశీలించి ఏర్పాట్లపై వారు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతుందన్నారు.
అదేవిధంగా వేటపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30కు రామన్నపేట హెలిప్యాడ్‌కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేజీ బజారులో ఏర్పాటు చేస్తున్న మగ్గాన్ని జేసీ నాగలక్ష్మి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment