' పీకల్లోతు అవినీతిలో సీఎం' | chandrabau naidu is most currepted cm says nagarjuna | Sakshi
Sakshi News home page

' పీకల్లోతు అవినీతిలో సీఎం'

Published Sat, Jun 6 2015 7:17 PM | Last Updated on Sat, Jul 28 2018 4:43 PM

chandrabau naidu is most currepted cm says nagarjuna

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళిత మంత్రులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు అగమ్యగోచరంగా మారిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమే కాకుండా, బడ్జెట్‌లో దళితులకు కేటాయించాల్సిన నిధుల్లో రూ.ఐదు వేల కోట్లు కత్తిరించారని ఆరోపించారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న దళిత మంత్రులు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనడానికి ఇటీవల మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దళిత హక్కులను కాలరాస్తుందన్నారు. దళితులకు న్యాయం చేయలేని మంత్రి పీతల సుజాత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement