సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ముంబై సీబీఐ విభాగంలో చంద్రశేఖర్ ఎస్పీగా విధులు నిర్వహించారు. సీబీఐ డీఐజీగా విధులు నిర్వహించిన హెచ్.వెంకటేష్ డిప్యుటేషన్ గడువు ముగియడంతో మరో వారం రోజుల్లో సొంత కేడర్ కేరళకు తిరిగి వెళ్లనున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ప్రధాన దర్యాప్తు అధికారిగా వెంకటేష్ ఉన్నారు. వాస్తవానికి ఆయన డిప్యుటేషన్ ఈ ఏడాది జూలై 16తో ముగిసింది. అయితే జగన్ కేసు దర్యాప్తు కారణంగా ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించారు. కాగా 2009లో సీబీఐలోకి ఎస్పీగా డిప్యుటేషన్‌పై వచ్చిన వెంకటేష్‌కు ఈ ఏడాది మొదట్లో డీఐజీగా పదోన్నతి లభించింది.