నాయకులకు సంఘీభావం తెలుపుతున్న వై.సీతారామిరెడ్డి
మంత్రాలయం రూరల్ : ప్రధాని మోదీ చేతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలు బొమ్మగా మారాడని ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవధ్యాక్షుడు వై.సీతారామిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహర దీక్షకు మద్దతు మంత్రాలయంలో చేపట్టిన రిలే నిరహర దీక్షలు గురువారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ముందుగా చిలకలడోణ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, దస్తగిరి, రంగస్వామి, వీరేష్, మహదేవా, మహ్మద్, వీర చంద్ర, తాయన్న, నరసన్న, రంగన్న, నరసప్పలతో పాటు కొంతమంది దీక్షలో కూర్చున్నారు. వీరికి వై.సీతారామిరెడ్డి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎందుకు హోదా కోసం పోరాటాలు చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ టి.భీమయ్య, నాయకులు అశోక్ రెడ్డి, భీమోజీరావు, చిలకలడోణ జగన్,
వెంకటరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, అశ్వధామరెడ్డి, వీరశేఖర్‌రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment