తెలుగు మీడియం అభ్యర్థుల గగ్గోలు
పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షలో(ప్రిలిమినరీ) భాగంగా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) పేపర్ వల్ల తెలుగు మీడియం, ఇతర ప్రాంతీయ మాధ్యమాల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ప్రిలిమ్స్‌లో 200 మార్కులకు నిర్వహించే సీశాట్ పేపర్‌లో ఆంగ్లం, గణితం చదివిన అభ్యర్థులే ఉత్తీర్ణులవుతున్నారని, గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమంలో చదివినవారు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని వారు వాపోతున్నారు.
సివిల్స్ తెలుగు ప్రశ్నపత్రం కోసం అభ్యర్థనలు పంపండి
అభిల భారత సర్వీసుల సిలబస్‌పై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరవింద్ వర్మ కమిటీకి తెలుగు ప్రశ్నపత్రం రూపకల్పనపై అభ్యర్థనలు పంపాలని ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంలో తెచ్చిన మార్పులు తెలుగులో పరీక్ష రాసే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిటీకి తమ అభ్యర్థనలు పంపించాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది. అభ్యర్థనల్ని లేఖ/ఫోన్‌కాల్/ఈ-మెయిల్ ద్వారా (అరవింద్ వర్మ (మాజీ ఐఏఎస్), కె-67ఏ (ఎఫ్‌ఎఫ్), హౌజ్ ఖాస్ ఎన్‌క్లేవ్, న్యూ ఢిల్లీ-110016, ఫోన్లు: 011-26859476, 981007908, ఈ-మెయిల్: (ఠ్చిటఝ్చ్చటఠిజీఛీః జిౌఝ్చజీ. ఛిౌఝ) కమిటీకి చేరవేయాలని సూచించింది.
సివిల్స్‌లో సీశాట్‌తో అన్యాయం!
Published Sat, Jul 19 2014 2:00 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement