సాక్షి, తాడేపల్లి: చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకులను తిరిగి రప్పించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎంపికయిన 35 మంది యువకులను శిక్షణ కోసం సంస్థ.. చైనా పంపించింది. యువకులు శిక్షణ పొందుతున్న వూహాన్ సిటీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. వారిని వెనక్కి పిలిపించాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వారిని భారత్‌కు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment