సాక్షి, అమరావతి : గ్రామీణ పేదరిక నిర్మూలన కమీటీ(సెర్ప్)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెంచిన పెన్షన్ పంపిణీపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సైతం బడ్జెట్ సమీక్షలు నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఆయా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రెండు రోజులు పాటు జరిగే కీలక సమీక్షల్లో ఏ శాఖకు ఎంత బడ్జెట్ కావాలో మంత్రులు, అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోనున్నారు. బడ్జెట్‌లో నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో నవతర్నాలు అమలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేటాయింపుపై సమీక్ష జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment