బోధన్ రూరల్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల పనితీరు మెరుగుపర్చకపోతే చర్యలు తప్పవని చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం మండలంలోని హంగర్గ, ఖండ్‌గావ్, సిద్దాపూర్, కల్దుర్కి గ్రామాలలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హంగర్గలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
హాజరు పట్టికను, స్టాక్ రిజిష్టర్‌ను పరిశీలించారు. అంగన్‌వాడీ కా ర్యకర్త బదురునీసా స్థానికంగా ఉండకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను విధుల నుంచి తొలగించాలని సీడీపీవో వెంకటరమణమ్మను ఆదేశించారు. ఆమె స్థానంలో అర్హత కలిగిన గ్రామానికి చెందిన మరొకరిని నియమించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను, గదులను పరిశీలించారు.
తెలుగు మీడియం పాఠశాలలో 24మంది విద్యార్థులకు గాను 12మంది విద్యార్థులే హాజరు కావడంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఉర్దూ మీడియం పాఠశాలలో కూడా విద్యార్థులు తక్కువగా వచ్చారు. దీంతో తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలల ఉపాధ్యాయులు రేణుక, సంధ్య, రహిమతుల్లా, నజీరాబేగంలకు చార్జి మెమోలు జారీ చేయాలని ఎంఈఓ పద్మజాను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గ్రామ ప్రజలతో మాట్లాడారు. గ్రామంలోని పత్తిపంటలను పరిశీలించారు. పత్తిపంట దిగుబడి, గిట్టుబాటు ధర తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఖండ్‌గావ్, సిద్దాపూర్, కల్దుర్కి గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. పిల్లల హాజరు పట్టికను, స్టాక్ రిజిష్టర్‌లను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భణులకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు గుడ్డు, ఆకుకూరలు, పాలు ఎలా అందుతున్నాయని సీడీపీవో వెంకటరమణమ్మను అడిగి తెలుసుకున్నారు. పిల్లల బరువు తూకం వేసి చూడాలని అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదేశించి, పిల్లల బరువును పరిశీలించారు.
ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం గురించి తెలుసుకున్నారు. ప్రతిపాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కల్దుర్కిలో * 98లక్షలతో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని సంబంధిత అర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ హరినారాయణన్, తహశీల్దార్ రాజేశ్వర్, ఎంపీడీఓ మల్లారెడ్డి, ఎంఈవో పద్మజా, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ లక్ష్మీనారాయణ ఉన్నారు.
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష
బోధన్ పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, స్థానిక అధికారులతో కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనితీరు మెరుగుపర్చుకోవాలి
Published Thu, Jan 23 2014 5:13 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement