
ఈ జన్మకు ఇది చాలు..!
- సేవకుడిలా పనిచేస్తా
- అందర్నీ కలుపుకుపోతా
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు
చిత్తూరు (అర్బన్): ‘‘ సామాన్య కార్యకర్తగా కష్టపడి పనిచేస్తే ఎలాంటి గుర్తింపు వస్తుందనడానికి నేనే నిదర్శనం. 1982లో ఓ సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాకు ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి, జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో మరచిపోలేని రోజు. ఈ జన్మకు ఇది చాలు...!’’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా నుంచి తన పేరు ప్రకటించిన తరువాత హైదరాబాదు నుంచి సోమవారం చిత్తూరుకు వచ్చారు.
చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ దాదాపు 33 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా వచ్చిన తనను పార్టీ అధిష్టానం తొలి నుంచే ఆదరిస్తోందన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఎంపీపీగా, రాష్ట్ర బోర్డుల్లో సభ్యులుగా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, సీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తే పార్టీ క్రియాశీలక కార్యకర్తలు 2 గంటలైనా పార్టీ కోసం పనిచేయాలన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. పేరుకు పదవుల్లో ఉన్నా తాను టీడీపీ కార్యకర్తననే విషయాన్ని విస్మరించబోనన్నారు.
ఎమ్మెల్సీ పదవి ఊహించనది...
తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రిలో చూపించడానికి వెళుతున్న తనకు పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి అధిష్టానం గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ప్రకటించారని చెప్పడం ఎప్పటికీ మరచిపోలేనిదని శ్రీనివాసులు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తాను ఎమ్మెల్సీగా ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. టీడీపీలో బీసీలకు ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుందనే విషయం మరో మారు స్పష్టమైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసుల్ని ఘనంగా స న్మానించారు.జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, పా ర్టీ నేతలు నాని, దొరబాబు, సురేం ద్రకుమార్, ఇందిరా, కఠారి మోహన్, బ ద్రీ, ఇందిరా, శ్రీధర్‌వర్మ పాల్గొన్నారు.