అగ్గిపెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్: షర్మిల | Congress created Conflicts between brothers: Sharmila | Sakshi
Sakshi News home page

అగ్గిపెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్: షర్మిల

Published Mon, Sep 2 2013 7:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అగ్గిపెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్: షర్మిల - Sakshi

అగ్గిపెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్: షర్మిల

తిరుపతి: రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించి, అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి కాంగ్రెస్ చలి కాచుకుంటోందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. తిరుపతి లీలామహాల్ సెంటర్లో సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తాను జగన్న పూరించిన శంఖారావాన్ని అని చెప్పారు. విభజన పేరుతో తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు.  వైఎస్ లేని నాలుగేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయిందని బాధపడ్డారు.  రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. 9 కోట్ల మందిలో 6 కోట్ల సీమాంధ్రులు విభజనను వ్యతిరేకిస్తున్నారు. సీపీఎం, ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీ ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవని తెలిపారు. ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం పదవులకు వేలాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన పథకాలకు తూట్లుపెట్టిందన్నారు. సమాన న్యాయం చేయలేనప్పుడు విభజించే హక్కు మీకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఒక తండ్రిలా అందరికి న్యాయం చేయమని వైఎస్ఆర్సిపి మొదటి నుంచి చెబుతూనే ఉంది. అలా కాని పక్షంలో రాష్ట్రాన్ని విభజించవద్దన్నది జగనన్న మాటని చెప్పారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదనే జగనన్న ఏడు రోజులు దీక్ష చేశారని చెప్పారు.

హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల ఆస్తులు లాక్కుంటామని టీఆర్‌ఎస్‌ అన్నది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలు కూల్చింది వాస్తవం కాదా? అని అడిగారు.  ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఉలకరు, పలకరు అని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదంటే కారణం విశ్వసనీయత లేకపోవడమేనన్నారు.

ప్రతిపక్షంలో ఉండి కూడా పాలక పక్షంతో పాలు, నీళ్లలా కలిసిపోయింది వాస్తవం కాదా? తెలంగాణపై బ్లాంక్‌ చెక్‌లా కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా? కోట్ల మందికి జరుగుతున్న అన్యాయంపై ఒక్క మాటైనా మాట్లాడారా? ఏ మెహం పెట్టుకుని సీమాంధ్రలో అడుగు పెట్టాలనుకున్నారు?   ప్రజల తరపు మాట్లాడకపోగా హైదరాబాద్ను నాలుగు లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టింది మీరు కాదా?  ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కాపాడిన  మీకు గౌరవం అంటూ ఏడ్చిందా?  మీరు రాజీనామా చేసి, మీ వారి చేత ఎందుకు రాజీనామా చేయించలేదు? అని ఆమె చంద్రబాబుపై  ప్రశ్నల వర్షం కురిపించారు.  

సభకు జనం భారీగా తరలి వచ్చారు. లీలామహాల్ సెంటర్ జనసముద్రమైంది. సభ జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ కోత విధించారు. సభ జరిగే ప్రదేశానికి కొద్ది దూరంలోనే  విద్యుత్ సరఫరా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement