బీజేపీ నాయకుడిపై దాడి... కానిస్టేబుల్ సస్పెన్షన్ | constable suspended in atacking a bjp leader | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుడిపై దాడి... కానిస్టేబుల్ సస్పెన్షన్

Published Tue, Feb 24 2015 8:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

బీజేపీ నాయకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు మంగళవారం సస్పెండ్ అయ్యారు.

అనంతపురం : బీజేపీ నాయకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు మంగళవారం సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు.... జీజేపీలో క్రీయాశీలకంగా పనిచేసే నాగేంద్రప్రసాద్ కదిరిలో హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో హోటల్‌కు వెళ్లిన కానిస్టేబుల్ అల్లాబకాష్, హోంగార్డులు సూర్యనారాయణ, ఆంజనేయులు హోటల్‌ను ఎందుకు మూసి వేయలేదని ఆడిగారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. గొడవపై పీఎస్‌ఐ వేణుగోపాలరావుకు కానిస్టేబుల్ సమాచార మిచ్చాడు. అందరూ కలిసి నాగేంద్ర ప్రసాద్‌ను చితకబాదారు. దీనిపై బాధితుడు ఎస్పీకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణలో లభించన ఆధారాలతో కానిస్టేబుల్, హోంగార్డులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement