పరిస్థితి దారుణంగా ఉంది
Published Fri, Jan 8 2016 10:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత ఘటనపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని విమర్శించింది. శాంతిభద్రతల పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోందని ఆ పార్టీ నేత నళిన్ కోహ్లీ ఆరోపించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా మిడ్నపూర్ జిల్లాలో గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఎన్‌హెచ్ 41 వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నక్రమంలో దుండగులు కాల్పులుకు తెగబడ్డాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్ నవకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మిడ్నాపూర్ ఎస్పీ, ఏఎస్పీ తదితర ఉన్నతాధికారులు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Advertisement
Advertisement