ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు ఎన్నాళ్ల నుంచో డిమాండు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సుమారు 18 వేల నుంచి 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా, తమకు ఉద్యోగ భద్రత మాత్రం లేదని వారు వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేసింది.