నీకది.. నాకిది | contractors are doing illegal works | Sakshi
Sakshi News home page

నీకది.. నాకిది

Published Sun, Nov 17 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

contractors are doing illegal works

 ప్రక్రియే ఇందుకు నిదర్శనం. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి పనులు పంచుకుని, ప్రజల సొత్తును అప్పనంగా దోచేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పనులను దక్కించుకున్న వారు జిల్లాను శాసిస్తున్న ఆనం సోదరుల అనుచరులు కావడంతోనే అంతా ఇష్టా రాజ్యంగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి వివిధ పథకాల నిర్మాణం కోసం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూఎస్ గ్రాంట్‌గా రూ.44.35 లక్షలు విడుదలైంది. ఈ నిధులతో ఆరు పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. అందులో భాగంగా ఈ నెల 11న టెండర్లను ఆహ్వానించారు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. అనుకున్న వారికే పనులు దక్కేలా కాంగ్రెస్ నేతల అనుచరులైన కాంట్రాక్టర్లు పావులు కదిపారు. ఒక్కో పనికి ఒక్కొక్కరే టెండర్ వేసేలా వ్యూహ రచనచేశారు. కొన్ని పనులకు పోటీ పెట్టినా నామమాత్ర లెస్‌తో పని దక్కేలా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. శనివారం టెండర్లు తెరిచిన సందర్భంగా కాంట్రాక్టర్ల రింగాట బయటపడింది.
 
 మూడు పనులకు లెస్‌లేకుండా అంచనాల మొత్తానికి , మరో మూడు పనులకు కేవలం 0.01 శాతం లెస్‌తో టెండర్లు దక్కించుకున్నారు. మొత్తం మీద ఐదు పనులకు సింగిల్ టెండర్ దాఖలు కాగా, ఒక్క పనికి మాత్రం నామమాత్రపు పోటీ పెట్టారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ దాఖలైతే రద్దు చేసి మళ్లీ టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం అత్యవసరం పేరుతో అన్ని టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఈ విధంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 పనుల కేటాయింపు జరిగిందిలా..
  దుత్తలూరు మండలంలోని వెట్టిపాళెం తాగునీటి పథకానికి రూ. 6.75 లక్షల అంచనాతో టెండర్ల పిలిచారు. ఇనమడుగు వాసి జి. వెంకయ్య అంచనా వ్యయానికి టెండర్ దక్కించుకున్నారు. ఉదయగిరి ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నే త బినామీతో ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
 
  నెల్లూరు రూరల్ మండలంలోని కందమూరు ఎస్సీ కాలనీలో తాగునీటి పథకానికి రూ.9.25లక్షలతో టెండర్లు పిలి చారు. ఈ పనిని కేవలం 0.01 శాతం లెస్‌తో మునెయ్య అనే కాంట్రాక్టర్  దక్కించుకున్నారు.
 
  వెంకటాచల మండలం ఎర్రగుంటలో తాగునీటి పథకానికి రూ.8.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఒక్క పనికి మాత్రమే నామమాత్రంగా ఇద్దరు పోటీపడ్డారు. మునెయ్య కేవలం ఒక్క శాతం ఎక్సెస్‌తో టెండర్ వేయగా మరో కాంట్రాక్టర్ కాలేషా 0.01శాతం లెస్‌తో వేసి పని దక్కించుకున్నారు.
 
  ముత్తుకూరు మండలంలోని కావలి దళితవాడలో తాగునీటి పథకానికి రూ. 5.55 లక్షలు మంజూరయ్యాయి. ఈపనులను 0.01శాతం లెస్‌తో కాలేషా దక్కించుకోవడం విశేషం.
  ముత్తుకూరు మండలంలోని గోవిందరెడ్డిపాళెంనకు రూ.4.55 లక్షలు మం జూరయ్యాయి. ఈ టెండర్‌ను కూడా 0.01 లెస్‌తో  కాలాషానే దక్కించుకున్నారు.
 
  టీపీ గూడూరు మండలంలోని మాచర్లవారిపాళెంలో తాగునీటి పథకానికి రూ 10లక్షలు మంజూరయ్యాయి. ఈ పనిని ఇనమడుగు ప్రాంతానికి చెందిన  జి. వెంకయ్య దక్కించుకున్నారు.   
 
  మొత్తం మీద మూడు పనులు కాలేషా, రెండు పనులు వెంకయ్య, ఓ పని మునెయ్య పరమయ్యాయి.
 
 అంతా పథకం ప్రకారమే
 ఏదైనా పనికి టెండర్లు ఆహ్వానించినపుడు అనేక మంది కాంట్రాక్టర్లు పోటీపడుతారు. 15 నుంచి 20 శాతం వరకు లెస్‌కు టెండర్ వేస్తారు. నెల్లూరులో గతంలో సీసీ రోడ్లు నిర్మాణంలో 20 శాతంకు పైగా లెస్‌లు వేసిన కాంట్రాక్టర్‌లు అనేక మంది ఉన్నారు. రెండేళ ్లక్రితం బారాషహీద్ దర్గా వద్ద జరిగిన రొట్టెల పండగ ఏర్పాట్ల పనులను ప్రభాకర్ అనే కాంట్రాక్టర్ 40 శాతం లెస్‌కు దక్కించుకుని, పూర్తి చేశారు. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో చేపడుతున్న పనులకు ముగ్గురే ముందుకు రావడం, ఓ అవగాహన ప్రకారం పనులు దక్కించుకోవడం అంతా ప్లాన్ ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement