ఏసీబీ వలలో ‘సహకార’ చేప
ఏలూరు : ప్రజాప్రతినిధుల అండదండలతో వివిధ శాఖల్లో డెప్యూటేషన్‌పై పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా సహకార అధికారి (డీసీవో) సంగంరెడ్డి కృష్ణమూర్తి ఏసీబీ అధికారుల కు అడ్డంగా దొరికిపోయూరు. పెదపాడు సొసైటీ సీఈవో వల్లూరి వెంకటకృష్ణయ్య నుంచి శనివారం రూ.20 వేల లంచం తీసుకుం టుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కృష్ణమూర్తి సొమ్ములొచ్చే శాఖల్లోనే డెప్యూటేషన్ వేయించుకుని మరీ పనిచేసేవారని, అవినీతికి పాల్పడటం ద్వారా రూ.కోట్లకు పడగలెత్తారన్న విమర్శలున్నాయి. కాగా చివరకు మాతృశాఖలోనే పని చేస్తూ ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయూంశమైంది.
రెండు నెలల క్రితమే జిల్లాకు బదిలీ
డీసీవో కృష్ణమూర్తి ఇంతకుముందు హైదరాబాద్ వ్యవసాయ సహకార సొసైటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు. జూన్ 2న ఇక్కడ డీసీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి కార్యాల యంలో అందుబాటులో ఉన్నది చాలా తక్కువ కాలమే. ఇటీవల భీమవరం, కొవ్వూరు,తణుకు ప్రాంతాల్లోని సొసైటీలకు వెళ్లి తనిఖీల పేరిట ఉద్యోగుల్ని హడలెత్తించారన్న విమర్శలొచ్చారుు. ఇదేవిధంగా పలువుర్ని లంచం కోసం బెదిరించారనే ఆరోపణలున్నారుు. తని ఖీలకు వెళ్లే సమయంలో డఫేదార్‌ను తీసుకువెళ్లేవారు కాదని సమాచారం.
మాజీమంత్రి అండదండలతోనే
సంగంరెడ్డి కృష్ణమూర్తి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెల్లెలి భర్త. ఆయన స్వగ్రామం విజయనగరం జిల్లా మిరాకముదిమి మండలం ఊటవల్లి గ్రామం. 1996లో డెప్యూటీ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన సహకార శాఖలో చేరారు. బొత్స సత్యనారాయణ అండదండలతో కీలకమైన ఐఏఎస్ పోస్టుల్లో సైతం డెప్యుటేషన్‌పై పనిచేసి కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తుల్ని కూడబెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. విశాఖపట్నంలో ఉడా కార్యదర్శిగా, విజయనగరం డ్వామా పీడీగా, జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా, హైదరాబాద్ వ్యవసాయ సహకార సొసైటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
సహకార శాఖలో వేళ్లూనుకున్న అవినీతి
సహకార శాఖలో అవినీతి వేళ్లూనుకుపోయింది. ఇటీవల సస్పెండ్ అయిన పి.రామ్మోహన్ ఇక్కడ రెండుసార్లు డీసీవోగా పనిచేశారు. ఆయన కూడా కార్యాల యం నిర్మాణానికి పరిపాలన ఆమోదం విషయంలోను, తనిఖీల పేరిట సొమ్ములు స్వాహా చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇదిలావుండగా, గతంలో రూ.2.50 కోట్ల సొసైటీ సొమ్మును ఉద్యోగులు తమ సొంతానికి వాడేసుకున్నా ఇప్పటివరకు రికవరీ చేయలేదు. ఏదైనా ఆరోపణ వ స్తే సహకార అధికారులకే పండగే. విచారణల పేరిట కాలయాపన చేస్తూ కాసులు వెనకేసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.