కార్మిక నగర్‌లోనే అత్యధిక కరోనా కేసులు: సీపీ | CP Dwaraka Tirumala Rao Visits Red Zone Areas In Vijayawada | Sakshi
Sakshi News home page

రోడ్లపై తిరిగితే క్వారంటైన్‌కు తరలిస్తాం: సీపీ

Published Wed, Apr 29 2020 3:09 PM | Last Updated on Wed, Apr 29 2020 3:26 PM

CP Dwaraka Tirumala Rao Visits Red Zone Areas In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: మీ భద్రత మా బాధ్యత దయచేసి మీరు ఇళ్లకు పరిమితం అవ్వండి అంటూ సిటీ పోలీసు కమిషనర్‌ ద్వారక తిరుమలరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని  రెడ్‌జోన్లలో సీపీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనవసరంగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చారించారు. (‘వైరస్‌ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం కాదు’)

కార్మిక నగర్‌లోనే అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రెడ్‌జోన్‌ ప్రాంతంలో లోపలి వారు బయటకు రాకుండా బయట వారు లోపలికి వెళ్లడం నిషేధమన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘింగిస్తే కఠిన శిక్షలు తప్పవని, కేసులను ఆషామాషిగా తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చిరించారు. కాగా ప్రతిరోజు నగరంలో రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కవాతు నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌లో అందరూ ఇంట్లొనే ఉండి కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement