దేశంలో మతచాందసవాదులు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
'మతచాందసవాదులు రెచ్చిపోతున్నారు'
Published Wed, Sep 6 2017 12:24 PM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM
కడప: దేశంలో మతచాందసవాదులు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణహత్యకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో బిల్బప్ సర్కిల్‌లో ఈ రోజు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దేశంలో మతచాందసవాదుల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నెలరోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
Advertisement
Advertisement