- సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్దం
- విశాఖకు చేరుకున్న పార్టీ అగ్రనేతలు
- వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రాక
- కళావాణి వేదికగా నేడు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: సీపీఎం 21వ అఖిలభారత జాతీయ మహాసభలకు తొలిసారిగా విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మహాసభలు మంగళవారం నుంచి ఆదివారం వరకు స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగనున్నాయి.
మహాసభల సందర్భంగా విశాఖ నగరంతో పాటు గ్రామీణమంతా ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కింది. రాష్ర్ట విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రలో ఓ రాజకీయ పార్టీ అఖిలభారత మహాసభలు జరగడం ఇదే ప్రధమం. ప్రతినిధుల సభ జరుగనున్న పోర్టు కళా వాణి ఆడిటోరియాన్ని గ్రామీణ,గిరిజన ప్రాంత నివాసాలు, వృత్తులు, సాంస్కృతిక, సంప్ర దాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మహాసభలు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభం కానున్నాయి.
ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. మహాసభలో వివిధ పోరాటాలు, ఉద్యమానుభవం కల్గిన 900 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సభలు శనివారం వరకూ జరుగనున్నాయి. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బహిరంగసభ జరుగనున్న ఆర్కే బీచ్ వరకు భారీ ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం అక్కడ భారీ బహిరంగసభ జరుగనుంది.
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబింగా
మహాసభల ప్రాంగణం పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. సహజ వనరులు, ప్రకృతిలో లభించే వస్తువులతో నయానందకరంగా రూపొందిం చారు. పర్యావరణానికి ఎటువంటి నష్టంలేకుండా వివిధ ఆకృతులు తయారు చేశారు. ప్రతినిధుల మహాసభ ప్రవేశద్వారాన్ని గిరిజనులు నివసించేఆవాసాలను తలపించేలా ముస్తాబు చేసారు. మేదరు, జనపనార,కొబ్బరి పీచును ఉపయోగించే అనేక రూపాలతో మనస్సును కట్టిపడేలా రూపాలను ఏర్పాటు చేశారు. వేదికను అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ప్రతినిధులు భోజనం చేసే మూడు భోజన శాలలకు శారద,నాగావళి, వంశధార నదుల పేర్లు పెట్టారు.ప్రాంగణంలో గ్రామీణ వాతావరణం ఉండేలా ఎండ్లబండ్లు, కోళ్ల గూళ్లు, తాటాకులతో ప్రత్యేకంగా పాకలు ఏర్పాటు చేశారు.ఆడిటోరియంలోని చెట్లను కొబ్బరి పీచు,కాగితపు తోరణాలతో అలంకరించారు.
మహాసభల్లో చర్చించనున్న అంశాలివే
ఈ మహాసభల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో ఎలా వ్యవహరించాలి. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకు రానుంది.అంతకంటే ముఖ్యంగా సీపీఐ(ఎం) తనస ఒంత బలాన్ని పెంచుకోవడంపైనే మహాసభ దృష్టి కేంద్రీకరించ నుంది. నిర్మాణ పరమైన లోపాలు, బలహీనతలువంటి అంశాలపే ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ప్లీనంలో చర్చించాలని కేంద్ర కమిటీ గతంలోనే నిర్ణయించింది. వామపక్ష ఐక్యత మరింత బలపడేలా చొరవ తీసుకునేందుకు మహాసభ చర్చించనుంది. కేంద్రంలో మోడి, రాష్ర్టంలోని చంద్రబాబు, ఇతర రాష్ట్రాల్లోని పాలకపార్టీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను బలోపేతం చేసే అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నారు.
అరుణ కిరణాలు
Published Tue, Apr 14 2015 3:20 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement