కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Published Tue, Aug 13 2013 4:01 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు వల్ల విద్యుత్, సాగునీరు, ఉద్యోగాల లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ తప్పుడు నివేదికలతో మోసపూరిత ప్రకటనలు చేసి రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టినందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది.
సీఎం హోదాలో ఉంటూ కుట్రపూరితంగా తప్పుడు నివేదికల ద్వారా ఆగస్టు 8న ప్రచార మాధ్యమాల ద్వారా ఇరుప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడి ఇద్దరు తెలంగాణప్రాంత విద్యార్థుల మృతికి కారణమయ్యారని ఆరోపిస్తూ సుంకరి జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన కోర్టు సీఎం కిరణ్‌పై ఐపీసీ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం)సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సెప్టెంబర్ 16న కోర్టుకు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Advertisement