ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం
Published Sun, Feb 2 2014 2:17 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్ :ప్రజాస్వామ్య విలువలు పెంపొం దించడంలో మీడియా పాత్ర కీలకమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక కన్నావారితోటలోని కేకేఆర్ ప్లాజాలో శనివారం ఏపీయూడబ్ల్యుజే రూపొందిం చిన 2014 మీడియా డైరీని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా మాట్లాడుతూ మీడియాలో పోటీతత్వం పెరిగి ందనీ, ఆ పోటీతత్వంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మరో ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం మీడియా కృషి చేయాలనీ, సమస్యలను వెలికి తీయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉం దని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇం డియా సభ్యులు కె.అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతున్నామని చెప్పారు. సభ కు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా అధ్యక్షుడు పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ జిల్లాలోని జర్పలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.సోమసుందర్, ఉపాధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, అంబటి ఆంజ నేయులు, ప్రెస్ అకాడమీ మాజీ గవర్నింగ్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరా వు, డీపీఆర్వో పి.మనోరంజన్, వైఎస్సా ర్ సీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, యూని యన్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యు డు దండా గోపి, కార్యదర్శి చింతాడ రమేష్, యూ నియన్ మాజీ అధ్యక్షుడు కె.వి.భాస్కర్‌రెడ్డి, యడ్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం సీని యర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావును యూని యన్ నాయకులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఆయనకు ఆర్థిక సాయం చేశారు.
Advertisement
Advertisement