తిరుపతిలో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న సగిలి వెంకటసుబ్బారెడ్డి ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. రూర ల్ పరిధిలోని సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెంది న చంద్రారెడ్డికి కుమారులు వెంకటసుబ్బారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి.
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: తిరుపతిలో డి ప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న సగిలి వెంకటసుబ్బారెడ్డి ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. రూర ల్ పరిధిలోని సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెంది న చంద్రారెడ్డికి కుమారులు వెంకటసుబ్బారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి. పవన్‌కుమార్‌రెడ్డితోపాటు తండ్రి చంద్రారెడ్డి గత కొన్నేళ్ల నుంచి కువైట్‌లో ఉంటున్నారు.
వెంకటసుబ్బారెడ్డి తాళ్లమాపురంలోని జిల్లా ప రిషత్ హైస్కూల్‌లో 10వ తరగతి, ప్రొద్దుటూరులోని భావన జూని యర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఎస్‌కేఎస్‌సీ కాలేజీలో డిగ్రీ చదివా రు. డిప్యూటీ జైలర్‌గా ఎంపికైన అనంతరం 2013లో ట్రైనింగ్ పూర్తి చేసి 2014 ఏప్రిల్‌లో తిరుపతి సబ్‌జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే ఆయన ఎస్‌ఐ పరీక్షరాసి ఎంపికయ్యారు.