యారాడ గ్రామంలో మురుగు కాలువలో కలిసిపోయిన పైపులైన్
మల్కాపురం : యారాడ గ్రామంలోకి వచ్చే తాగునీటిని సేవించాలంటేనే గ్రామస్తులు ఆలోచించాల్సి వస్తోంది. పైపులైన్ ద్వారా వచ్చే నీటిని తాగితే ఎలాంటి రోగాలు దరిచేరుతాయోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. జీవీఎంసీ 45వ వార్డు యారాడ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ఐదేళ్ల క్రితం పలు చోట్ల పైపులైన్లు వేశారు. అయితే పీఎస్సార్ కాలనీ, స్థానిక జెడ్పీ పాఠశాల ప్రాంతాల్లో వేసి న పైపులైన్లు మాత్రం అక్కడున్న మురుగు కాలువలకు ఆనుకొని వేశారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో మురుగు నిలిచిపోతున్నప్పుడల్లా తాగు నీటిపై అనుమా నం వస్తోంది. ఆ మురుగు పైపులైన్ వాల్వ్‌ల వద్ద ఉన్న ప్లాంజ్ ద్వారా లోపలికి ప్రవేశించి నీటి సరఫరా జరిగే సమయంలో తాగునీటితో కలిసిపోతోంది. ఒక్కోసారి తాగునీరు మురుగు వాస న వస్తోందని గ్రామస్తులు చెబుతుండడమే ఇం దుకు ఉదాహారణ. మురుగుతో కలిసిపోయే నీటితే సేవించినందుకు గతంలో ఆయా ప్రాంత వాసులకు జ్వరాలు, వాంతులు వచ్చాయి. సమ స్య పరిష్కారం కోసం గ్రామస్తులు జీవీఎంసీ జోన్–4 జెడ్సీతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కూడా ఎన్నోమార్లు వివరించారు. అయినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.
మురుగునీరే వస్తోంది
ఇక్కడకొచ్చే తాగునీరు మురుగునీటిలా వస్తోంది. ఆ నీరు తాగలేని పరిస్థితి ఉంది. గతేడాది వర్షాకాలంలో కాలువల్లో మురు గు అధికంగా నిల్వ ఉండిపోవడంతో వారం రోజుల పాటు ఆ నీటి నే పట్టాల్సి వచ్చింది. పిల్లలకు అనారోగ్యం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment