సాక్షి ప్రతినిధి, కర్నూలు : కరువు వుండలాల ప్రకటనలోనూ జిల్లాను ప్రభుత్వం వెక్కిరించింది. కేవలం 12 వుండలాల్లో వూత్రమే కరువు ఉందని తేల్చి చెప్పేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ ఏఆర్ సుకువూర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జిల్లాలో కరువు విలయుతాండవం చేస్తోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆలస్యంగా ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. తర్వాత కూడా వర్షాలు కురవకపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోరుుంది.
అనేక వుండలాల్లో పంటలు ఎండిపోరుున పరిస్థితులు నెలకొన్నారుు. పండిన పంట కూడా వాస్తవంగా రావాల్సిన దిగుబడుల కంటే సగానికి సగం పడిపోయూరుు. వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధరలు లభించడంలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక అనేక వుంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే జిల్లాలో 54 వుండలాలకుగానూ 34 వుండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం వూత్రం సాగు విస్తీర్ణంతో పాటు ఇంకా దిగుబడులు 50 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఉందని కాకిలెక్కలు చెబుతూ కేవలం 12 వుండలాలను వూత్రమే కరువు వుండలాలుగా ప్రకటించింది. దీనిపై అన్నదాతలో ఆందోళన వ్యక్తవువుతోంది. కరువు వుండలాలుగా ప్రకటిస్తే కనీసం పెట్టుబడి రారుుతీ అయినా వస్తుందనుకుంటే దాన్ని కూడా దక్కకుండా ప్రభుత్వం చేసిందని రైతులు వుండిపడుతున్నారు.
కలెక్టర్ పంపిన వుండలాల జాబితా ఇదే...
కర్నూలు, కల్లూరు, కోడుమూరు, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, ప్యాపిలి, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, వెలుగోడు, పాణ్యం, గడివేముల, బనగానపల్లె, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి, గోస్పాడు, కోవెలకుంట్ల, దొర్నిపాడు, కొలిమిగుండ్ల, అవుకు, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర
ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు...
కోసిగి, చాగలమర్రి, డోన్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కొలిమిగుండ్ల, మంత్రాలయం, నందికొట్కూరు, ప్యాపిలి, ఉయ్యాలవాడ, వెల్దుర్తి
కరువు వుండలాలు పన్నెండే
Published Thu, Dec 18 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement