సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇపుడు ఆ భర్తీ పక్రియను ఎలా జాప్యం చేయాలా అని విద్యాశాఖ దారులు వెదుకుతోంది. మరోపక్క కొత్తగా ఉద్యోగ నియామకాలు వద్దని, వాటితో ఖజానాపై భారం పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతుండటంతో డీఎస్సీని సకాలంలో నిర్వహించడంపై అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ఏదో ఒకసాకుతో డీఎస్సీని ఆలస్యం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. జాప్యం చేయడానికి రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తికి మించి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణం ఒకటైతే.. టీచర్ల రేషనలైజేషన్, బదిలీల ప్రక్రియతో ఈ నియామకాలను ముడిపెడుతుండటం మరో కారణంగా చూపడానికి విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. దీంతో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కావడంలో మరింత జాప్యం తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని భర్తీ చేయాలి? తదితర అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పుడు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం చూస్తే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే తగినంత నిష్పత్తిలో విద్యార్థులు లేని పరిస్థితుల్లో కొత్తగా నియామకాలు ఎలా అన్న సంశయంలో అధికారులున్నారు.
డీఎస్సీపై నీలినీడలు
Published Wed, Feb 18 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement