తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభ, ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కే చంద్రశేఖర్‌రావు,
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభ, ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కే చంద్రశేఖర్‌రావు, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొంది సీఎం పదవి చేపట్టారు.
ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. కాగా ఏపీలోని నందిగామ నుంచి గెలుపొందిన తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో మరణించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలిరోజున ఈ రెండుస్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వివరించారు.