Notification of election
-
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయను న్నారు. ఫలితాలు వెలువడిన తరువాత మేయర్/ చైర్పర్సన్ల ఎన్నిక కోసం విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈనెల 29 లేదా 30న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. ఈ మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓట్లగణన పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. తుది ఓటర్ల జాబితా రాగానే కార్పొరేషన్లలో డివిజన్లకు, మునిసి పాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించనున్నట్లు మునిసిపల్ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘా నికి సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కరోనా నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్
-
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
ఓట్ ఫర్ గుడ్
మేఘాదాస్ జొమాటోలో పని చేస్తారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆమె. కస్టమర్లకు ఫుడ్‌ని డెలివరీ చెయ్యడం కోసం రోజంతా మంగళూరు రోడ్లపై తన వాహనాన్ని పరుగులెత్తిస్తుంటారు. ఫుడ్ఆర్డర్ని టైమ్‌కి అందించకపోతే తన కంపెనీకి పేరు పోతుంది. అదీ ఆమె తొందర. అయితే ఆమె తొందరకు, ఆమె నడిపే స్కూటీ వేగానికి మంగళూరు రోడ్లపై గతుకులు, గోతులు అడ్డుపడుతూ ఉంటాయి. అవి మాత్రమే కాదు, చీకటి పడ్డాక ఆమె డ్యూటీ మరింత కఠినతరం అవుతుంది. కస్టమర్ చిరునామా కోసం బండిని ఆపి ఎవర్నైనా అడగవలసి వచ్చినప్పుడు అదేమంత సురక్షితమైన పనిలా ఆమెకు అనిపించదు. ఆమెను అదోలా చూస్తారు. అడిగిన చిరునామా కాకుండా.. అభ్యంతరకరమైన చిరునామాల గురించి చెప్పడం మొదలుపెడతారు. ఈ స్వీయానుభవాలతో మేఘాదాస్కు రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. ఒకటి మంగళూరు రోడ్లు బాగోలేవు. ఇంకొకటి మంగళూరు రోడ్లపై మహిళలకు భద్రత లేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించడం? తనొక్కరి వల్ల అయ్యే పని కాదు. పదిమందిని కలుపుకుని ఉద్యమించడానికి లీడర్ కాదు తను. ఫుడ్ డెలివరీ చెయ్యాలి. ఇంటికింత సంపాదించుకుని వెళ్లాలి. మరెలా! అప్పుడు పడింది.. మంగళూరు సిటీ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్. తనూ ఎన్నికల్లో నిలబడితే! నిలబడి గెలిస్తే! తను అనుకున్నది చెయ్యొచ్చు.చేయించడానికి తన అధికారంతో ఒత్తిడి తేవచ్చు! ఆమె ఆలోచన నచ్చి కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మేఘాదాస్. ‘‘28వ వార్డుకు పోటీ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి గెలిస్తే నేననుకున్నది చేసి తీరుతాను’’ అంటున్నారు మేఘ. ఫుడ్ డెలివరీ కోసం అనువు కాని దారుల్లో కాలంతో పాటు పరుగులు తీసిన మేఘ.. మంగళూరు సిటీని దారిలోకి తెచ్చేందు ఒక్క క్షణమైనా విశ్రమించకుండా పని చేస్తారనే అనిపిస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ మేఘా. -
ముంచుకొస్తున్న మున్సి‘పోల్స్’
సాక్షి, కరీంనగర్ : మున్సిపాలిటీలకు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నెలాఖరున ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల గణన వంటి అంశాలను ఖరారు చేయడంలో అధికారులు తలమునకలు అవుతున్నారు. ప్రతీ రోజు అర్ధరాత్రి వరకు పనులు చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఫొటో ఓటర్ల జాబితాను డివిజన్ల వారీగా తయారు చేస్తున్నారు. 10న ముసాయిదా జాబితా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి 14న తుది జాబితా వెలువరించనున్నారు. అదే రోజు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో పోటీ చేయడానికి ఆశావహులు, తాజా మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సన్నద్ధం అవుతుండగా... మున్సిపాలిటీలపై పట్టు సాధించడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల గణన సిద్ధమవుతుండడంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఏ డివిజన్ అనుకూలంగా వస్తుందోననే ఆందోళన నెలకొంది. దీంతో పక్కపక్కనే ఉన్న రెండు, మూడు డివిజన్లపై దృష్టి సారించి ఆయా డివిజన్లు, వార్డుల ప్రజలతో ఇప్పటికే తాను పోటీలో ఉంటున్నానని, తనకు మద్దతు తెలపాలని కోరుతూ అందరినీ కలుస్తున్నారు. మొత్తంమీద పట్టణప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రిజర్వేషన్లు ఖరారైతే ఇక నోటిఫికేషన్ రాకున్నా ప్రచారం ఊపందుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రచారానికి ఎక్కువగా సమయం ఉండదనే భావన నాయకుల్లో ఇప్పటికే చోటుచేసుకుంది. దీంతో ఒక్క రోజు కూడా వృథా చేయకుండా కాలనీల్లోనే గడుపుతున్నారు. పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం... మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పట్టణాల్లో రాజకీయ సందడి ప్రారంభమైంది. డివిజన్లు, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ఏ మేరకు తమకు అనుకూలిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మేయర్/చైర్మన్, కార్పొరేటర్/కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఆయా పార్టీల నేతల చుట్టు ప్రదక్షిణలు చేస్తూ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు స్థానికంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి యత్నాలు ప్రారంభించారు. కొంతమంది ఎన్నికల ఖర్చు కోసం నిధుల వేటను ప్రారంభించగా, మరికొందరు ఓటర్లకు అడ్వాన్స్‌గా తాయిలాల హామీలను కూడా ఇస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు మున్సిపాలిటీల్లో పట్టు సాధించడానికి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు మున్సిపల్ ఎన్నికలపై పట్టు కోల్పొకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ సైతం సభ్యత్వ నమోదును ప్రారంభించి డివిజన్ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి స్థానికగా అర్ధబలం, ప్రజాబలం ఉన్న నేతల కోసం దృష్టి సారిస్తున్నారు. బ్యాలెట్‌తోనే ఎన్నికలు.. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్ణయించింది. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను ఈ నెల 14న ప్రకటించి, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు నాలుగు మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనుండడంతో పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు, జమ్మికుంటలో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 వార్డులుగా విభజించారు. ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసిన పోలింగ్స్టేషన్ల వారీగా బ్యాలెట్ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సహాయ అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. నేడో, రేపో పునర్విభజన గెజిట్.. డివిజన్లు, వార్డుల పునర్విభజన గెజిట్ నేడో, రేపో ప్రభుత్వ వెలువరించే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన ముసాయిదా పునర్విభజన జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలిసింది. డివిజన్ల పునర్విభజనలో ఆనవాళ్లు కోల్పోయిన వార్డులకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు న్యాయబద్ధంగా ఉన్నవాటిని పరిష్కరించి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం గెజిట్ రూపంలో డివిజన్ల తుది స్వరూపాన్ని వెలువరించనుంది. -
రెండో విడతకు రెడీ
మెదక్ రూరల్: మూడు విడతల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ఈనెల 26 (శుక్రవారం) నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కానుంది. రెండో విడతలో మొత్తం ఆరు మండలాలకు గాను 6 జెడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరగనుంది. ఈనెల 26న రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, మే 10న పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ ప్రకటించింది. రెండో విడతలో నర్సాపూర్ డివిజన్ కేంద్రం నుంచి నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ డివిజన్ నుంచి వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు గతంలో జిల్లా కేంద్రంలోనే నామపత్రాలను స్వీకరించగా, ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఆయా మండల కేంద్రాల వద్ద బారికేడ్స్, కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రం వద్ద ముగ్గురు రిటర్నింగ్ అధికారులు, ముగ్గురు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. కాగా మొదటి విడత ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
నేడు పరిషత్ రెండో విడత నోటిఫికేషన్
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల సందడి మరికొన్ని మండలాలకు పాకనుంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహాయించి మిగతా 17 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 13 పాత మండలాలు ఉండగా, నాలుగు కొత్త మండలాలు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగనుండగా రెండో విడత ఎన్నికలు ఐదు మండలాల్లో జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రసవత్తరం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబం ధించి మొదటి విడతలో ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లో బుధవారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురువారం నామినేషన్ల పరిశీలన కొనసాగింది. ఆదివారం ఉపసంహరణ ఘట్టం తర్వాత ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎంతమంది, ఎవరు బరిలో ఉంటారనేది తేలనుంది. ప్రధాన పార్టీల నుంచి అన్నిచోట్ల పోటీలో ఉన్నారు. ఇక మొదటి విడతలోని ఆరు మండలాల్లో ప్రచార పర్వం జోరందుకోనుంది. మొదటి విడతలో మే 6న పోలింగ్ జరగనుండగా అంతకు ముందు మే 4 సాయంత్రం వరకు ప్రచారం సాగనుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆశావహుల సందడి.. రెండో విడతలో పలు జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఇక్కడ పోటీ వాతావరణం కనిపిస్తోంది. రిజర్వేషన్ల ప్ర కటనతోనే పలువురు ఆశావహులు ఆయా మండలాల్లో పోటీ – చేయాలని ముందుగానే నిశ్చయించుకొని ఉన్నారు. మరోపక్క ఈ ఐదు మండలాల్లో గతంలో టీఆర్ఎస్ గెలుపొందింది. బోథ్ నియోజకవర్గంలోని మండలాలైన వీటిలో టీఆర్ఎస్ కేడర్ బలంగా ఉన్నా ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కాగా, ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ చైర్మన్ పదవి ఆశావహులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పలు జనరల్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరెవరు రంగంలోకి దిగుతారనే దానిపై ఆయా మండలాల్లో ఆసక్తి నెలకొంది. నేరడిగొండ ఆసక్తికరం.. నేరడిగొండ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్‌జాదవ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి 28వేల ఓట్లు సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు అతను టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన జెడ్పీచైర్మన్ పదవి ఆశిస్తూ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఇప్పుడు జెడ్పీచైర్మన్ అయ్యే వ్యక్తి ఐదేళ్ల తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు నేరడిగొండ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఎలాంటి ఎత్తుగడ అవలంబిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. -
నేడే ‘తొలి’ ఘట్టం
మెదక్ రూరల్: స్థానిక సంగ్రామానికి అంతా సిద్ధమైంది. పరిషత్ ఎన్నికల్లో ‘తొలి’ ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కానుంది. జిల్లాలో 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 4,84,995 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు, 189 ఎంపీటీసీ స్థానాలకు గాను, 1,032 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత 6 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మే 6న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 27న ఫలితాలను వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ తర్వాత మూడు రోజుల పాటు నామినేషన్ సమర్పణకు గడువిచ్చారు. ఆన్లైన్ ద్వారా సైతం నామినేషన్లను దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో డీపీఓ హనూక్, డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా మండలాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు గతంలో జిల్లా కేంద్రంలోనే నామపత్రాలను స్వీకరించగా, ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయంలోనే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల వద్ద బారీకేడ్లు, కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రం వద్ద ము గ్గురు రిటర్నింగ్ అధికారులు, ముగ్గురు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. -
నేడు మొదటి విడత నోటిఫికేషన్
హన్మకొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధిం చి సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదే రోజు నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లను మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. గతంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీల నామినేషన్లు స్వీకరించే వారు. ఈ సారి ఎన్నికల నిర్వహణలో మార్పు తీసుకువచ్చారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రంలో జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 7 మండలాల్లో 86 ఎంపీటీసీ స్థానాలకు 7 జెడ్పీటీసీలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2,24,188 మంది ఓటర్లకుగాను 457 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 6న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల ఏర్పాటు ఎంపీటీసీల నామినేషన్లు ఈ సారి క్లస్టర్ల వారిగా స్వీకరించనున్నారు. గతంలో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించే వారు. నామినేషన్ల ప్రక్రియ సులువుగా కొనసాగేందుకు క్లస్టర్లుగా విభజించింది. ప్రతి మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ సారి ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే సౌకర్యాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నేరుగా నామినేషన్ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల క్లస్టర్లు హసన్‌పర్తి మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎల్కతుర్తిలోని 12 ఎంపీటీసీలకు 4, కమలాపూర్‌లోని 18 ఎంపీటీసీలకు 6, భీమదేవరపల్లిలో 13 ఎంపీటీసీలకు 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ప్రతి మండలంలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రిటర్నింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ముగ్గులు పంచాయతీ కార్యదర్ళులు, ఒక ఆఫీస్ సబార్టినేట్ను నియమించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
నిజామాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల సమరానికి నేడు తెర లేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమరం మొదలు కానుంది. జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి నేడు (సోమ వారం) నోటిఫికేషన్ జారీ కానుంది. నేటి నుం చే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కా నుంది. తొలి విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీఅభ్యర్థులతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్రాల్లో నామపత్రాలు సమర్పించాల్సి ఉండేది. అయితే, ఈసారి మండల కేంద్రాల్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు మండలానికో రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించారు. ఇక, ముగ్గురు ఎంపీటీసీలకు గాను ఒక రిటర్నింగ్ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. వీరు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరిస్తారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 8 జెడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలకు.. మొదటి విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజామాబాద్, మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మాక్లూర్, నవీపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 8 జెడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలో జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.2500, ఇతరులు అయితే రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఇతరులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. -
ఊరికో పోలింగ్ స్టేషన్ !
నల్లగొండ : పరిషత్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చిన్నచిన్న ఊళ్లలో ఉన్న ఓటర్లు పక్క గ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చేది. దీంతో వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వ్యయ, ప్రయాసలకు గురయ్యేవారు. ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఏ గ్రామం ఓటర్లు అదే ఊరిలో ఓటు వేసే విధంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 400 ఓట్లు ఉన్న గ్రామంలో కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయంతో ఓటర్ల ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 31 మండలాల పరిధిలో 31 జెడ్పీటీసీలు, 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి 9,67,912 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 1,930 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్లకు ఒక పీఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,627 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. అయితే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో రెండుమూడు గూడేలు ఉండేవి.. ఆ గూడేల్లో 300 నుంచి 400 వరకు ఓటర్లు ఉండేవారు. 1200 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో.. గ్రామపంచాయతీల్లోనే ఉండేవి. దీంతో పక్కనున్న గూడేల ఓటర్లు న డుచుకుంటూ వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే కొంతమంది రా జకీయ పార్టీల నాయకులు ఓటర్ల రవాణా కోసం వాహనాలను ఏర్పాటు చేసే వారు. దాన్ని కూడా ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. కొందరు పక్క గ్రామానికి వెళ్లలేక ఓటు హక్కునుకూడా వినియోగించుకోలేదు. ఎంపీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్స్టేషన్లు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పోలింగ్‌కేంద్రాల సంఖ్యను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పడిన ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం 1000 నుంచి 1200 ఓటర్లకు ఒక పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,990కి చేరింది. పరిషత్ ఎన్నికల్లో 400 ఓటర్లకు పోలింగ్‌స్టేషన్.. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సంకల్పిం చిన ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల్లో 400 మంది ఓటర్లు ఉన్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటైనట్ల య్యింది అంటే 200 నుంచి 400 ఓటర్ల వరకు ఉన్న ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ ఓటర్లు ఉన్న గ్రామాలు జిల్లాలో 305 ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు వేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ఉదాహరణకు నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డికాలనీకి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో బట్టపోతులగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కనగల్ మండలంలోని కుమ్మరిగూడెం ఓటర్లు అమ్మగూడెంలో, చెల్లాయిగూడెం ఓటర్లు కనగల్‌లో, తిప్పర్తి మండలంలోని బండ్లోరిగూడెం ఓటర్లు జొన్నగడ్డలగూడెంలో, సర్వాయిగూడెం ఓటర్లు గొల్లగూడంలో ఓటు వేసేవారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారి ఇబ్బందులు తొలగనున్నాయి. -
నేటినుంచి నామినేషన్ల పర్వం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పరిషత్ మొదటి విడత ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. జిల్లాలో 3విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడత దేవరకొండ డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం ఉదయం పది గంటలకు విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. దేవరకొండ డివిజన్లో 10 మండలాల పరిధిలో 10 జెడ్పీటీసీ, స్థానాలకు 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డివిజన్లో 3,10,547 మంది ఓటర్లకు 643 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదలైన సమయం నుంచే.. మొదటి విడతకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన సమయం నుంచి ఆ డివిజన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు సమర్పించవచ్చు. సోమవారం నుంచి ఈనెల 24 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వీటిని స్వీకరిస్తారు. 25వ తేదీన స్క్రూట్నీ నిర్వహిస్తారు. 26న నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈనెల 28న నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఉపసంహరణల అనంతరం బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే మే 6వ తేదీన మొదటి విడతకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఆన్లైన్ ద్వారా నామినేషన్లకు అవకాశం.. నామినేషన్లను నేరుగా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ సమర్పించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఈ విధానాన్ని గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎవరైనా ఆన్‌లైన్‌ద్వారా నామినేషన్ సమరించవచ్చు. అందుకు సంబంధించిన హార్డ్ కాపీలను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పిస్తేనే ఆ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రతి మండలంలో ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆ జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులంతా ఆయా మండలాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను అందజేయాల్సి ఉంటుంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సందర్భంలో జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులంతా జిల్లా పరిషత్‌లోనే నామినేషన్లు సమర్పించారు. ఈసారి మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీ సభ్యులంతా నామినేషన్లు సమర్పించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మూడు ఎంపీటీసీలకు ఒకేచోట నామినేషన్లు మూడు ఎంపీటీసీ నియోజకవర్గాల కేంద్రాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఆ మూడు ఎంపీటీసీ నియోజకవర్గాల పరిధిలోపోటీ చేసే అభ్యర్థులంతా ఆ రిటర్నింగ్ అధికారి నామినేషన్లను సమర్పిస్తారు. నామినేషన్ల స్వీకరణతోపాటు పరిశీలన, ఉపసంహరణ, ఫిర్యాదుల స్వీకరణతో పాటు రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు వారే బాధ్యత నిర్వహించనున్నారు. -
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్‌శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
నేడో, రేపో పరిషత్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ శుక్ర లేదా శనివారాల్లో విడుదల కానుంది. కొన్ని జిల్లాల గెజిట్లు గురువారం రాత్రికి, శుక్రవారం ఉదయం ప్రచురించే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్ జారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కారణంగా షెడ్యూల్ విడుదలకు అవకాశం లేకపోతే శనివారం వెలువడనుంది. రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా నాలుగు మండలాలు చేర్చడంతో, మండలాలు, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 539కు చేరింది. అయితే ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ వివాదం కారణంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలో 1.57 కోట్ల ›గ్రామీణ ఓటర్లున్నా రు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదయ్యే వారిని కూడా ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీంతో ఈ సంఖ్య 1.60 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి సమీక్ష... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం మ్యారియట్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీఆర్ ముఖ్యకార్యదర్శి (ఎప్ఏసీ) సునీల్‌శర్మ, పీఆర్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. తమ జిల్లాల పరిధిలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ నాగిరెడ్డిని పలువురు ఎస్పీలు కోరినట్లు సమాచారం. దీంతో 26 జిల్లాల్లో 3 విడతల్లో, 5 జిల్లాల్లో 2 విడతల్లో, కేవలం ఒక్క జిల్లాలో (మేడ్చల్–మల్కాజిగిరి) మాత్రం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు... రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలో కొత్తగా 4 మండలాలు అంటే 4 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలం పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి విడిగా మోస్రా, చండూరు మండలాలుగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను విడదీసి నారాయణరావుపేట, మేడ్చల్ జిల్లాలో శామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతో మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్ల జెడ్పీటీసీ స్థానాలను కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఎంపీపీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాక పరోక్ష పద్ధతిలో మండలాధ్యక్షులను ఎన్నుకుంటారు. మూడు చింతలపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ స్థానానికి రిజర్వు చేయగా... ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. మంగపేట జెడ్పీటీసీ ఎన్నిక వాయిదా... ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ జెడ్పీటీసీ స్థానం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నేపథ్యంలో హైకోర్టు దీని ఎన్నిక విషయంలో స్టే ఇచ్చింది. ఈ స్థానాన్ని ఎస్టీగానా లేదా జనరల్గానా ఎలా పరిగణించాలన్న వివాదంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నది ఎస్ఈసీని ములుగు కలెక్టర్ స్పష్టత కోరారు. హైకోర్టు స్టే విధించినందున ఇక్కడ ఎన్నిక నిర్వహించరాదని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు భేష్: వి.నాగిరెడ్డి జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించాం. జిల్లాల్లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉంది. తాము చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివరించారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. పరిషత్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. భద్రతాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామన్నారు. 22న తొలి నోటిఫికేషన్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఈ నెల 22న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా వచ్చే నెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. 26న రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేశాక.. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. వచ్చేనెల 14న తుది విడత ఎన్నికలతో పోలింగ్ ముగియనుంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించాకే పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే 32 జెడ్పీ చైర్పర్సన్లు, 5,187 ఎంపీపీ అధ్యక్షులను పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. -
ముహూర్తం చూసుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి ఈ నెల 25 వరకు లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. రెండు సెలవు రోజులు పోగా నామినేషన్ల స్వీకరణకు 6 రోజులే మిగలడం, అందులోనూ సుముహూర్తాలు కేవలం రెండు రోజులే ఉన్నట్లు జ్యోతిష్కులు చెబు తుండటంతో ఆ తేదీల్లో నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ నెల 19, 25 తేదీల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పండితుల లెక్కల ప్రకారం, ఈ నెల 19న మంగళవారం మఖ నక్షత్రం, త్రయోదశి తిథి ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కలసి వస్తుందని పేర్కొంటున్నారు. మంగళవారం మంచిరోజు కాద న్న అభిప్రాయం తప్పని భావించే వారు 19న నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నామినేషన్లు వేసిన 28 మంది ప్రముఖ పార్టీల అభ్యర్థులందరూ గెలుపొందారని గుర్తుచేస్తున్నా రు. 21న గురువారం ఉత్తర నక్షత్రం, పౌర్ణమి–పాఢ్యమి తిథి రానుండటం మంచి ముహూర్తమని పం డితులు పేర్కొంటున్నారు. అయితే ఆ రోజు హోలీ సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 22న మంచి రోజనే భావన ఉన్నా శుక్రవారానికి ఆది దేవత లక్ష్మీదేవి అయిన కారణంగా ఎన్నికల వ్యయం భారంగా మారుతుందనే చర్చ ఉంది. దీంతో శుక్రవారం నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. 23న శనివారం కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవచ్చు. ఇక 24న ఆదివారం స్వాతి నక్షత్రం రానుండటంతో సుమూర్తంగా భావిస్తారని కానీ, ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 25న సోమ వారం విశాఖ నక్షత్రం, పంచమి తిథి రానుండటంతో నామినేషన్ల దాఖలకు సమూహర్తమని పండితులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్... తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందడి సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు తొలివిడత కింద ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్‌సభ స్థానాలుండగా మొత్తం స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెలవు రోజులు మినహా ఇతర పని దినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవులు కావడం తో నామినేషన్లు స్వీకరించరు. 25తో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తి కానుంది. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఏప్రిల్ 11న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభ, ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కే చంద్రశేఖర్‌రావు, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొంది సీఎం పదవి చేపట్టారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. కాగా ఏపీలోని నందిగామ నుంచి గెలుపొందిన తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో మరణించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలిరోజున ఈ రెండుస్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వివరించారు. -
శిబేరాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ప్రాదేశిక ఫలితాల్లో ఈసారి గరిష్టంగా 28 మండలాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఒకరి సభ్యులను మరొకరు లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ నెలకొంది. దీంతో ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. పదవులు ఆశిస్తున్న నేతలు ఎంపీటీసీ సభ్యులను శిబిరాలకు తీసుకెళ్లారు. వీరిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తిప్పుతున్నారు. ఎన్నికలు శుక్రవారమే కావడంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొందరు ఇతర రాష్ట్రాలకూ తరలివెళ్లారు. మొత్తానికి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు మాత్రం తడిచి మోపెడు అవుతున్నాయి. జిల్లాలో 59 మండలాలకుగాను కాంగ్రెస్ పార్టీ 25 చోట్ల సొంతంగా పాలకవర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించింది. టీఆర్ఎస్కు కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ ఉంది. 28 మండలాల్లో ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో అధికార టీఆర్ఎస్ ఈ ‘హంగ్’ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ల సాయంతో మండలాలను దక్కించుకుని పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్కే జై కొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. గులాబీ జెండా... రెపరెపలాడేనా ! సంస్థాన్‌నారాయణపురం మండలంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు. టీఆర్ఎస్కు నలుగురు ఉండగా,మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండగా, వారిలో ముగ్గురిని తమవైపు లాగేసుకునే పనిలో ఉన్నారు. నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు ఈ మండలమూ టీఆర్ఎస్ వశమవుతుంది. రాజాపేట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం. టీఆర్ఎస్కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. తుర్కపల్లి మండలంలో టీఆర్ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల్సి ఉంది. గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరినట్లే. అర్వపల్లి మండలంలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు.