తవ్వకాలు జరిగిన ప్రాంతం
చిత్తూరు, శాంతిపురం: మండలంలోని గణేష్‌పురం అటవీ సరిహద్దు ప్రాంతంలోని తిమ్మలమ్మ చెరువు గట్టు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి భారీగా గుప్త నిధులు లభించాయనే ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కేరళకు చెందిన వారిగా భావిస్తున్న వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వారు కొంతమంది స్థానికులతో కలిసి తవ్వకాలు జరిపినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల కుప్పం మండలంలోని గుడ్లనాయనపల్లి ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున గుప్త నిధుల వేట సాగిన నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు కూడా అదే ముఠా పనై ఉంటుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment