'పవన్ సినిమాలు చూడండి..కాంగ్రెస్‌లోనే ఉండండి'
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి రాజకీయంగా అండగా ఉండాలని చిరంజీవి అభిమాన సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తో వెళ్లకూడదని చిరంజీవి అభిమానుల తీర్మానించారు. పవన్ సినిమాలు చూడండి..కాని కాంగ్రెస్‌లోనే ఉండండని అభిమాన సంఘాల నేతలు అభిమానులకు సూచించారు. పవన్‌ను సినిమాల వరకే అభిమానించాలని...రాజకీయంగా చిరంజీవికి మద్దతు తెలుపాలని నేతలు తెలిపినట్టు సమాచారం.
విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొనకుండా అభిమానులను మెగా ఫ్యాన్స్ నేతలు అడ్డుకున్నట్టు వార్తలు వెలువడుతున్నసంగతి తెలిసిందే. విశాఖపట్నం సభకు హాజరుకాకుండా మెగా హీరో రాం చరణ్ జన్మదిన వేడుకల్ని భారీ ఎత్తున జరిపేందుకు మెగా ఫ్యాన్స్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హటావో, దేశ్ కో బచావో అనే నినాదంతో చిరంజీవికి వ్యతిరేకంగా పవన్ రాజకీయంగా పావులు కదపడం కొంత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.