విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మరణించారు. ఈ సంఘటన రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల గ్రామ శివారు లో బుధవారం ఉదయం వెలుగు చూసింది.
రేగోడ్, న్యూస్‌లైన్: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మరణించారు. ఈ సంఘటన రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల గ్రామ శివారు లో బుధవారం ఉదయం వెలుగు చూసింది. అడవి పందుల బారినుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలంలో అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు వీరికి తగలడం తో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకా రం.. కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రంజానాయక్ తండాకు చెం దిన వాల్యానాయక్‌కు భార్య ఉమ్లీబాయి, ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరికి మూడెకరాల భూమి ఉంది. సొంత పొలాన్ని సాగు చేస్తూనే ఖాళీ సమయంలో కూలి పనులు చేస్తుంటారు. వాల్యానాయక్ ఏజెంటుగా వ్యవహరిస్తూ చెరకు సీజన్ లో ఫ్యాక్టరీలకు కూలీలను పంపిస్తుం టాడు. వాల్యానాయక్ తన పెద్ద కుమారుడు రవినాయక్‌తో కలిసి ఎద్దుల కొనుగోలు కోసం మంగళవారం రాత్రి 9 గంటల తరువాత అడ్డదారిలో అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి వెళ్లారు. బుధవారం ఉదయం కూడా తండ్రీ కొడుకులు ఇంటికి చేరుకోలేదు.
ఇంతలో వాల్యానాయక్(65), రవినాయక్(30) లు కరెంటు షాక్‌కు గురై చనిపోయారంటూ వాల్యానాయక్ బావమరిది పూల్యానాయక్‌కు సమాచారం అందిం ది. పూల్యానాయక్ వెళ్లి చూడగా ఓ రైతు పత్తి చేల్లో ఇద్దరి మృతదేహాలు కన్పించా యి. రంజానాయక్ తండా నుంచి ఆర్.ఇటిక్యాల గ్రామం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓ రైతు తమ పొలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడంతో ప్రమాదవశాత్తు ఆ తీగలు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. వాల్యా కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా మరో ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు కాలేదు. మృతుడు రవి నాయక్‌కు భార్య రుక్మీబాయితోపాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. తండ్రీకొడుకుల మృతితో రంజానాయక్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ సీఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాల్యా బావమరిది పూల్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రేగోడ్ ఏఎస్‌ఐ అఫ్జల్ తెలిపారు.