సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2013-14 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో ప్రవేశాలు నిర్వహించే కళాశాలల జాబితాను విద్యాశాఖ ఖరారు చేసింది. 667 డీఎడ్ కాలేజీల్లో 35,250 సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో కన్వీనర్ కోటాలో 28,830 సీట్లను భర్తీ చేస్తారు. మేనేజ్‌మెంట్ కోటాలో యాజమాన్యాలు 6,420 సీట్లను భర్తీ చేయనున్నాయి. 25 ప్రభుత్వ డీఎడ్ కాలేజీల్లోని 3,150 సీట్లతోపాటు 642 ప్రైవేట్ కాలేజీల్లోని 25,680 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు డైట్‌సెట్-2013 కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
19వ తేదీన సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో ఈనెల 23వ తేదీనుంచి 26లోగా నిర్ణీత ర్యాంకు ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. రెండో దశ డీఎడ్ కౌన్సెలింగ్‌ను డిసెంబర్ 2వ తేదీనుంచి 19 వరకు నిర్వహిస్తారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 10వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 16వ తేదీ నుంచి 19 వరకు కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఇంకా సీట్లు మిగిలితే డిసెంబర్ 27వ తేదీ నుంచి 30 వరకు చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27వ తేదీ నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి 30వ తేదీన సీట్లు కేటాయిస్తారు.
డీఎడ్ కళాశాలల జాబితా ఖరారు
Published Mon, Nov 11 2013 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement