బొకారో ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
తాడేపల్లిగూడెం: కేరళ నుంచి బొకారో వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న సమయంలో ఎస్8 భోగిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే పోర్టర్లు ట్రైన్ ను నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహించారు. బ్రేక్‌లు పట్టేయడంతో పొగలు అలుముకున్నాయని గుర్తించి వాటిని సరిచేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.