కృష్ణాజిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఆగివున్న లారీని ఓ మినీ వ్యాన్ ఢీకొంది.
కృష్ణ జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని -డీసీఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న 15 మంది, డీసీఎం వాహనంలో పశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లికి బయలుదేరారు.
శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరపల్లి వద్ద ఆగిఉన్న లారీని, డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎం వాహనంలో ఉన్న కెమికల్స్ లీక్ కావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు .మరో మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని.. మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడకు తరలించారు .