పోర్టు సిగలో మరో నగ | for Sea transport is the Green channel | Sakshi
Sakshi News home page

పోర్టు సిగలో మరో నగ

Published Mon, Jun 8 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

పోర్టు సిగలో మరో నగ

పోర్టు సిగలో మరో నగ

- సముద్ర రవాణాకు ‘గ్రీన్‌చానల్ ’
- విశాఖ పోర్టు సిద్ధం చేస్తున్న కొత్త బెర్త్
- రూ.90 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి
- 1.5 మిలియన్ టన్నుల టర్నోవర్ లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం:
విశాఖ పోర్టులో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు బీజం పడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెర్తులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా గ్రీన్‌చానల్ బెర్త్‌ను నిర్మించేందుకు పోర్టు ట్రస్ట్ సన్నాహాలు చేస్తుంది. ఏడాదిలోగా దీన్ని పూర్తిచేస్తే భారీ నౌకలు సైతం నేరుగా ఇన్నర్ చానల్‌కు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం 11 మీటర్ల లార్డ్స్(నౌక) మాత్రమే ఇన్నర్ ఛానల్‌లోకి వెళ్లగలుగుతున్నాయి. అంతకన్నా పెద్దవి వస్తే వాటిని అవుటర్‌లో లైట్‌నింగ్ చేయాల్సి వస్తోంది. కనీసం 18.5 మీటర్ల డ్రాఫ్ట్ ఉంటే తప్ప సూపర్ కేప్ వెళ్లలేవు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తొలి దశలో 14.5 లార్డ్స్ వచ్చేలా హార్బర్‌ను విస్తరించనున్నారు.

పాతవి ఐదు బెర్త్‌లు తొలగించి వాటి స్థానంలో కొత్త బెర్త్‌లు నిర్మించనున్నారు. దానిలో భాగంగా గ్రీన్‌చానల్ బెర్త్ సిద్ధమవుతోంది. పోర్టులో ప్రస్తుతం ఇన్నర్ హార్బర్‌లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. అవుటర్‌లో ఎస్‌పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. తొమ్మిది నెలల్లో గ్రీన్ చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి విడత రూ.45 కోట్లు, మలివిడత రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనిలో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేటాయిస్తుంది. ఈ బెర్త్ అందుబాటులోకి వస్తే 1.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. పోర్టులో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్న ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. గ్రీన్‌చానల్ బెర్త్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఇనుము, సిమెంట్ లావాదేవీలు నిర్వహించనున్నట్లు పోర్టు వర్గాల సమాచారం.

యూరప్ దేశాలలో 40 శాతం సరుకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7 శాతం మాత్రమే జరుగుతోంది. నిజానికి ఒక టన్ను సరుకు రోడ్డు మార్గంలో రవాణా చేయడానికి అయ్యే ఖర్చులో సగానికే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతో పాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత పోర్టులను అభివృద్ధి చేసి సముద్ర రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే విశాఖ పోర్టుకు నిధుల సాయం చేయడం ద్వారా గ్రీన్‌చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement