
రాజంపేట : వైఎస్సార్ జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పసుపు లేటి బ్రహ్మయ్య బుధ వారం ఆకస్మికంగా మరణించారు. బ్రహ్మయ్యకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కన్ను మూశారు. బ్రహ్మయ్య పార్థివదేహాన్ని కడప లోని ఆయన స్వగృహానికి తరలించారు. టీడీపీ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నందలూరు మండలంలోని పొత్తపికి చెందిన ఈయన సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.