హైదరాబాద్: తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు దిశానిర్దేశం లేదని రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శించారు. యూపీఏ హయాంలో ఇచ్చిన హామీలు, ప్రతిపాదనలే కేంద్రమంత్రి సురేష్ ప్రభు మరోసారి చదివి వినిపించారని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నిధులు సమకూర్చుకోవటం, కొత్త ప్రాజెక్టులు రూపొందించటం ప్రతి బడ్జెట్లోనూ ఉంటాయని కోట్ల అన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మామూలు అంశాలు కూడా లోపించాయని విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజలను పూర్తిగా నిరాశ పరచిందని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు.