నలుగురు డీసీసీ చీఫ్‌ల రాజీనామా
Published Sat, Feb 22 2014 1:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఆమోదించిన పీసీసీ చీఫ్ బొత్స
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులు శుక్రవారం తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంతపురంలో మధుసూదన్‌గుప్తా, చిత్తూరులో రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లాలో అశోక్‌కుమార్‌లు తమ రాజీనామా లేఖలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపారు. బొత్స వీటిని వెంటనే ఆమోదించారు. ఇదిలావుంటే, పీసీసీ అధికార ప్రతినిధులుగా కొత్తవారికి అవకాశంకల్పించాలని బొత్స భావిస్తున్నారు. దీనిపై కసరత్తు ముమ్మరం చేశారు.
Advertisement
Advertisement