కొవ్వూరు, న్యూస్‌లైన్ : నాలుగు రోజుల పాటు ప్రమాద స్థాయిలో ప్రవహించి జిల్లా ప్రజల ను వణికించిన వరద గోదావరి క్రమంగా శాంతి స్తోంది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి 19 అడుగులకు చేరిన నీటిమట్టం తగ్గుతోంది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు నీటిమట్టం 17.75 అడుగులకు తగ్గడంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఇంకా వరద ముంపులోనే ఉంది. సుమారు 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గీతా మందిరం గర్భాల యంలో వరద తొలగిపోవడంతో సిబ్బంది ఆల యూన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు. వరద ప్రభావంతో ఆలయంలో ఒండ్రు మట్టి పెద్దఎత్తున పేరుకుపోయింది. మద్దూరులంక వరద ముంపు నుంచి తేరుకుంటోంది. అధికారులు ఇక్కడి పునరావాస కేంద్రాన్ని ఎత్తివేశారు. మం గళవారం ఉదయం 6 గంటలకు 17.40 అడుగులున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 16.20 అడుగులకు తగ్గింది.
ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు 15.40 అడుగులకు చేరుకుంటుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేశారు. మం గళవారం సాయంత్రం 7 గంటలకు ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 16లక్షల 81వేల 984 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. గత నెలలో 20నుంచి 9 రోజులపాటు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. ఈనెలలో ఆరు రోజులుగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గోదారి శాంతిస్తోంది
Published Wed, Aug 7 2013 5:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement