ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి! | government GO's profit for TDP leaders only | Sakshi
Sakshi News home page

ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి!

Feb 26 2015 3:27 AM | Updated on Jul 11 2019 9:04 PM

ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి! - Sakshi

ఆ జీవోలతో తెలుగు తమ్ముళ్లకే లబ్ధి!

రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు సదరు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని, టీడీపీ శ్రేణులకు ప్రయోజనం కలిగించేలా జీవోలు జారీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆగ్రహం


సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు సదరు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని, టీడీపీ శ్రేణులకు ప్రయోజనం కలిగించేలా జీవోలు జారీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు సర్కారు జారీ చేసిన 135, 101, 535 జీవోలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘పచ్చచొక్కాల పందికొక్కులకు లబ్ధి చేకూర్చేందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ జీవోలు జారీ అయ్యాయి’ అని నిప్పులు చెరిగారు.
 
పింఛన్లతో సహా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారానే జరగాలని నిర్దేశించడం దారుణమన్నారు. వీటిలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించామని చెప్పారని అయితే ఏ గ్రామ కమిటీలో చూసినా టీడీపీకి చెందిన వారే నియమితులయ్యారని, దీంతో కింది నుంచి పైస్థాయి వరకు పాలనంతా రాజకీయమయంగా మారిందని అన్నారు. నేరస్తులు, రౌడీలే ఈ కమిటీల్లో ఉన్నారన్నారు. ఏ ఒక్క కమిటీలో నైనా టీడీపీ వారు కాకుండా ఒక్క స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి ఉన్నా తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని, దీనిపై చర్చకు రావాలని సీతారాం సవాలు విసిరారు. ‘టీడీపీ ఆధ్వర్యంలోని కమిటీలే అన్నీ నిర్ణయిస్తే ఇక పాలనాధికారులెందుకు? వారిని రద్దు చేయండి’ అని తమ్మినేని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. సర్పంచుల అధికారాలను గ్రామకమిటీల మాటున టీడీపీ వారికి దత్తం చేశారని అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలికిన వారికి పింఛన్లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను రద్దు చేయడం దారుణమన్నారు.
 
ఆ 500 కోట్లు ఎవరు బొక్కారు?
తూర్పు గోదావరిలో జరిగిన ఇసుక కుంభకోణంలో రూ.500 కోట్లు ఎవరు తిన్నారో చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలే ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నారని చెప్పి వారి మాటున టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారన్నారు. ఆ జిల్లాలో ఈ భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ శాఖ కలెక్టర్‌కు నివేదిక సమర్పించిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement