ఇటు ఆశలు.. అటు నోటీసులు
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రుణాలు చెల్లించాలంటూ నోటీసులు అందడంతో పాటు బ్యాంకర్ల నుంచి ఒత్తిడి అధికమవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కమిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేయడం, ఆ తర్వాత రోజుకో రకమైన ప్రకటనలు వస్తుండడంతో అస్సలు రుణాలు మాఫీ అవుతాయా లేదా అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
వారం రోజుల క్రితం కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రుణాలు వూఫీ చేస్తావుని, కుప్పం ప్రాంత ప్రజలు తీసుకున్న రూ.6 కోట్ల త్రీకేఆర్ రుణాలను సైతం మాఫీ చేస్తావుని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బ్యాంకర్లు రుణాల రికవరీ కోసం రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందోనని రైతులు అంటున్నారు.
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
వెంటనే రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండడం, సంబంధిత బ్యాంకులు ప్రకటనల ద్వారా దినపత్రికల్లో పేర్లను బహిర్గతం చేస్తుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. రుణాల వూఫీపై ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాల ను వె ల్లడించక పోవడంతో అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలు అయోమయంలో పడ్డారు. దీంతో పాటు డ్వాక్రా సంఘాలు పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకర్లు రుణాల మొత్తానికి జవు చేస్తుండడంతో వుహిళల పరిస్థితి దయునీయుంగా వూరింది.
కుప్పంలో రూ. 247.001 కోట్లు మాఫీ కావాల్సి ఉంది
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలా ల్లో 36,649 వుందికి గాను 247.001 కోట్ల రూపాయులు రుణమాఫీ కావాల్సి ఉంది. పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా 25,824 వుంది రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి రూ 186.541 కోట్లుగా రుణం తీసుకున్నారు. వ్యవసాయు పంటరుణాల రూపంలో 10,825 వుంది రూ 60.46 కోట్లు రుణాలు పొంది ఉన్నారు. దీంతో పాటు 3500 డ్వాక్రా సంఘాలకు గాను మహిళలు రూ. 75 కోట్ల రుణాలు పొంది ఉన్నారు.
కుప్పం వుండలం ఎన్.కొత్తపల్లెకు చెందిన బాలావరదరాజులు గత ఏడాది సిండికేట్ బ్యాంక్‌లో సజ్జలపల్లె రెవెన్యూలోని సర్వే నంబర్ 38-1లోని 1.41 ఎకరాల పొలంతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.48 వేలు రుణం తీసుకున్నారు. ప్రస్తుతం తాకట్టు పెట్టిన నగలకు గడువు ముగిసిం దని తెలుపుతూ వడ్డీతో సహా రూ.52,220 చెల్లించాలని నోటీసులు పంపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని ఎంతో ఆశతో ఉంటే బ్యాంకు అధికారులు ఇలా నోటీసులు పంపడం దారుణవుని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మడల పరిధిలోని నూలుకుంట కొత్తపల్లె గ్రామానికి చెందిన రావుచంద్ర గత ఏడాది జూన్ 14వ తేదీ సిండికేట్ బ్యాంక్‌లో తవు తండ్రి చిన్నప్ప పేరుతో ఉన్న 2.5 ఎకరాల పొలంతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.65,300 రుణం తీసుకున్నారు. తాకట్టు పెట్టిన వ్యవధికాలం చెల్లిందని పే ర్కొంటూ వడ్డీతో సహా రూ.69,310 చెల్లిం చాలని వారం రోజుల క్రితం బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. నోటీసులు చూడగానే రుణాల మాఫీపై ఆశలు వదులుకున్నామని బాధిత రైతులు చెబుతున్నారు.